మనిషికన్నా కుక్కమిన్న | Telugu Stories of Akbar and Birbal with Lessons

మనిషికన్నా కుక్కమిన్న

Telugu Stories of Akbar and Birbal with Lessons

Telugu Stories of Akbar and Birbal with Lessons: అక్బరుపాదుషావారు సభాసదులను ఉద్దేశించి “సభికులారా! విశ్వాసము అవిశ్వాసము అంటుంటారు. ఏమిటది?” అని ప్రశ్నించెను. చేసినది- పెట్టినది, ఇచ్చినది స్వల్పమే అయినా గుర్తు కలిగి ప్రవర్తించడం విశ్వాసం అనబడుతుంది.

ఆ విధంగా కాకుండా, ఇంకా ఇచ్చేరు కాదు, అని చేసిన మేలును మరచిపోయి ప్రవర్తించడం అవిశ్వాసం అనబడుతుంది” అని వివరించాడు బీర్బల్. ‘అందుకు ఇందుకు చెప్పుకోదగ్గ వారెవరైనా ఉన్నారా?’ అని ప్రశ్నించాడు అక్బరు.

లేకేం పాదుషా విశ్వాసానికి పెట్టింది పేరు శునకం – పెట్టింది స్వల్పమే అయినా! ఒకసారి తిన్నశునకం ఎల్లకాలం పెట్టిన వారి పట్ల గుర్తు కలిగి ఉంటుంది.

వారికిగాని వారి ఇంటికిగాని యే విధమైన ఇబ్బంది కలుగకుండా గుర్తు కలిగి ప్రవర్తిస్తుంది. మనిషి తనకు. ఇచ్చింది ఎంతయినా, చేసినమేలు ఎంతటిదైనా కృతజ్ఞత చూపకపోగా, కపటప్రేమను అభినయిస్తూ,

మరింతగా తనను ఆదరించలేదని అలుగుతాడు – వారిక్షేమం కోరడం మాట అటుంచి, తన ప్రయోజనం కోసం ఎట్టి చెడును చెయ్యడానికైన

వెనుకాడడు. నరుని కన్నా విశ్వాస హీనుడు మరి ఉండబోడు. మీరు అంగీకరిస్తే రేపటిరోజున విశ్వాసం – అవిశ్వాసం కలిగిన వారిని తమ సమక్షంలో నిలబెడతాను” అన్నాడు.

ఆ మర్నాడు అతనొకకుక్కను – ఒక వ్యక్తిని తీసుకుని సభకు వచ్చేడు. జహాపనా! ఇది నా వీధిలో తిరుగాడే కుక్క దీనికి అప్పుడప్పుడు శేషపదార్ధాలను పెడుతుంటాము –

మా ఇంటివద్దనే ఉంటూ మమ్మల్ని మా క్షేమాన్ని కోరుతూ మసలు కుంటుంది. అని చెప్పి దానిని నానుండి వెడలగొట్టమని సేవకులకు ఆజ్ఞాపించండి, నిదర్శనం మీకే తెలుస్తుందన్నాడు.

రాజభటులు దానిని వానినుండి తరమబోగా అదివారిమీద తిరగబడి తరిమి మళ్ళీ బీర్బల్ దగ్గరకి వచ్చి కూర్చున్నది. వెంట తీసుకువచ్చిన మనిషిని ముందుకు పిలిచి, సార్వభౌమా ఇతడు మా ఇంటి ప్రక్కవారి అల్లుడు ప్రతీయేటా ఇతడ్ని పిలిచి చీని చీనాంబరాలు, కట్నకానుకలు ఇచ్చి మర్యాద చేస్తుంటాడు మామగారు.

అతనికి ఈ యేడాది మామగారు యేమిచ్చారో అడగండి? అన్నాడు. ఏమయ్యా! మీమామగారు ఈ సంవత్సరం నీకు యేమిచ్చాడు? అని ప్రశ్నించాడు అక్బరు. ప్రభూ ఇచ్చాడు. పెట్టుపోతల మొక్కుబడి తీర్చుకున్నాడు.

కట్నకానుకల విషయంలో మామగారంత పిసినారి మరొకరుండడం, ఈ స్వల్పానికి మమ్మల్ని రమ్మనడం – మాకు ఖర్చులు కలిగించడం దేనికండి. ఆపాటి కట్నకానుకలు నేరుగా పంపించవచ్చుగదా.

మేమురావడం దేనికి? అంటూ మామగారు చేసేపనులను దెప్పిపొడుస్తూ, మరింత చెప్పడంతో అక్బరుపాదుషా వారికి అర్ధమయ్యింది మనిషి ఎంత స్వార్ధపరుడో తెలిసింది.

కుక్కను మించిన విశ్వాసం గల జీవి మనిషిని మించిన విశ్వాసహీనుడు మహినుండరన్నది తెలిసేలా చేసి చెప్పిన బీర్బలన్ను అక్బర్ పాదుషా పొగిడాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment