మామిడిపళ్ళ విందు | Telugu Stories of Akbar and Birbal with Morals

మామిడిపళ్ళ విందు

Akbar and Birbal stories, Akbar and Birbal short stories, Akbar and Birbal tales, Akbar Birbal short stories, Akbar Birbal tales, Akbar and Birbal stories in English, Akbar and Birbal stories in Hindi, Akbar Birbal short stories in English, Akbar and Birbal short stories in English, Birbal stories, Birbal tales, Short stories of Akbar and Birbal in Hindi, Small story of Akbar and Birbal in English

Telugu Stories of Akbar and Birbal with Morals: అక్బర్ గారి అంతఃపురానికి స్వేచ్ఛగా వచ్చీపోయే సాన్నిహిత్యం బీర్బల్‌కు ఉండేది. యధాప్రకారం ఒకనాడు బీర్బల్ అంతఃపురానికి రాబోయేసరికి అక్బరాదుషా మామిడిపళ్ళను ఆరగిస్తున్నారు.

వచ్చిన బీర్బలు అప్యాయంగా ఆహ్వానిస్తూ అక్బర్వారు “రావయ్యా బీర్బల్! మంచి సమయానికి వచ్చావు. మామిడిపళ్ళు మంచి పసందుగా ఉన్నాయి.

కూర్చో తిందువుగాని” అన్నారు. అసలే మామిడిపళ్ళు, మంచిరుచిగా ఉన్నాయని ప్రభువు అంటున్నారు. తనకు కూడా వాటిపట్ల మోజు కలిగింది బీర్బల్‌కు.

చాలా ఇద్దరు కూర్చుని పళ్ళను ఆరగిస్తున్నారు. అక్బర్ పాదుషావారు పళ్ళరసాన్ని పీల్చి టెంకలను బీర్బల్ ముందున్న టెంకలలో పడవేయసాగారు.

మరికొంతసేపటికి “యేమయ్యా బీర్బల్ అంత ఆకలితో ఉన్నావా ఎక్కువ కాయలు తిన్నట్టున్నావు” అని బీర్బల్ ముందున్న టెంకలను చూపించి చమత్కరించారు. “ప్రభూ! నేను ఆకలితో ఉన్న మాట వాస్తవం. అదీగాక

పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. నేనుకాస్త అతిగానే పళ్ళను ఆరగించానన్నాడు. మరికొన్ని పళ్ళు తిను” అన్నాడు అక్బరాదుషా. ప్రభూ నాకు కడుపునిండిపోయింది.

భ్రాంతి తీరిపోయింది. ఇంక ఒక్కపండును కూడా పీల్చలేను. కాని తమరు నాకన్నా ఆకలితో ఉన్నట్టున్నారు. నేను టెంకలనయినా వదిలి వేసాను.

తమరు ఒక్క టెంకనుకూడా వదలకుండా టెంకలను సైతం ఆరగించారు. ఆకలితో ఉన్నట్టున్నారు తమరే నాలుగుపళ్ళు తినండి” అని చమత్కరించాడు బీర్బల్.

బీర్బల్ చమత్కారానికి ఆనందించి, తానుతిన్న పళ్ళెంలోని టెంకలను బీర్బల్ విస్తరిలో పడవేసినందుకు సిగ్గుపడ్డాడు. తన అవివేకాన్ని సున్నితంగా దుయ్యబట్టిన బీర్బల్‌ను అభినందిచాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment