పనితనం | Telugu stories on courage and bravery

పనితనం

Telugu stories on courage and bravery: ఒక కుర్రాడు ఒక మెడికల్ షాపుకి వెళ్ళి ఫోన్ చేసుకుంటానని షాప్ ఓనర్ని అడిగాడు. “ఇది ఎస్.టి.డి. బూత్ కాదు కానీ, నువ్వు ఒక ఫోన్ కాల్ చేసుకో” అని బదులిచ్చాడు.

ఓనర్. ఆ కుర్రాడు రిసీవర్ ఎత్తి ఒక నంబర్కి డయల్ చేశాడు. షాపులో కస్టమర్లు ఎవరూ లేక పోవడంతో షాపు ఓనర్ కుర్రాణ్ని గమనిస్తూ అతని ఫోన్ సంభాషణ వినసాగాడు.

“అమ్మా, మీరు నాకు తోటమాలి జాబ్ ఇవ్వగలరా?” అని ఫోన్లో అడిగాడు కుర్రాడు. “ఇప్పటికే ఒకతను నా దగ్గర తోటమాలిగా పనిచే స్తున్నాడు” అని అంది. అవతలి స్త్రీ.

“అమ్మా, నేను మీ తోటమాలి జీతంలో సగం జీతానికే, అతని కంటే ఇంకా బాగా పనిచేస్తాను” అన్నాడు కుర్రాడు. తన దగ్గర పని చేసే వ్యక్తి పని సంతృప్తికరంగా ఉందని ఆ స్త్రీ బదులి చ్చింది.

ఆ కుర్రాడు మరింత పట్టుదలతో, “అమ్మా, నేను మీ ఇల్లంతా స్తాను. మీ ఇంటి తోటను ఈ నగరంలోనే అత్యంత అందమైన తోటలా మారు స్తాను” అన్నాడు.

అవసరం లేదు బాబూ” అని అవతలి స్త్రీ ఫోన్ పెట్టేసింది. ముఖంపై చిరునవ్వుతో, ఆ కుర్రాడు ఫోన్ రిసీవర్ పెట్టేశాడు. అతని సంభాషణ విన్న షాపు ఓనర్ ఆ కుర్రాడితో “బాబూ! నాకు నీ వ్యక్తిత్వం నచ్చింది.

నీలో ఉన్న ఆశావహదృక్పథం నన్నెంతో ఆకట్టుకుంది. నీకు నేనొక జాబ్ ఇస్తాను. చేస్తావా?” అని అడిగాడు. “చాలా కృతజ్ఞతలండీ.

కానీ నేను నా పనితనాన్ని గురించి తెలుసుకోవడానికే ఈ ఫోన్ కాల్ చేశాను. నేను ఇందాక మాట్లాడిన ఆమె దగ్గరే తోటమాలిగా పనిచేస్తున్నాను” అని జవా బిచ్చాడు కుర్రాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment