లక్ష్యసిద్ధి | Telugu stories on kindness and honesty

లక్ష్యసిద్ధి

Telugu stories on kindness and honesty: అనగనగా శంఖవరం అనే ఒక ఊరిలో శేషయ్య శాస్త్రి, అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయన సంగీత కచేరీలతో చుట్టు పక్కల గ్రామాల్లో బాగా ప్రసిద్ధి గాంచారు.

ఆయన సంగీత కచేరీలు అంటే ప్రజలు బాగా ఇష్టపడేవారు. శాస్త్రిగారు ఎక్కడ కచేరీలు ఏర్పాటు చేసినా పండితుల నుంచి పామరుల వరకు అందరూ వచ్చి ఆస్వాదించేవారు.

ఆయన సంగీత కచేరీల ఏర్పాటు కోసం ఆ చుట్టు పక్కల ఊళ్ళ నుంచి ఆహ్వానాలు వచ్చేవి. శేషయ్య శాస్త్రి ఎప్పుడూ సంగీత కచేరీలతో క్షణం తీరిక లేకుండా ఉండేవారు. అయినా | కొద్దిమందికి శిక్షణ ఇచ్చేవారు.

శ్రీధర్ శర్మ అనే ఒక యువకుడు శేషయ్యశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి చేరాడు. ఆధునిక స్వభావం కలి గిన వ్యక్తి శ్రీధర్ శర్మ ఏపనైనా నిముషాల మీద అయిపోవాల | నుకునేవాడు.

ఎంతటి కార్యం అయినా ఇట్టే పూర్తి చేయాలని కలలు కనేవాడు. సంగీత సాధనపై కూడా ఇటువంటి అభి ప్రాయమే శ్రీధర్ శర్మకు ఉండేది. వీలైనంత త్వరగా సంగీత పాఠాలు పూర్తి చేసి కచేరీలు ఇవ్వాలని భావించాడు.

మొదటిరోజు సంగీత పాఠశాలకు శ్రీధర్ శర్మ వెళ్లాడు. సంగీత సాధన చేస్తున్న వారిని కలిశాడు. “ఇక్కడ సంగీత సాధనకు ఎంత కాలం పడుతుంది” అని వారిని అడిగాడు.

ఆరు నెలలు సంగీతంలోని ప్రాథమిక అంశాలు నేర్పుతారని, ఆ తర్వాత మరో ఆరు నెలలు సంగీత సాధన చేయాల్సి ఉంటుందని’ వారు తెలిపారు. అయితే “నేను ఆరు మాసాలు పూర్తి చేసిన వారితో చేరతాను” అన్నాడు.

అలాగే ఆరు మాసాలు సంగీత సాధన పూర్తి చేసిన వారితో కలిసి సంగీత సాధన పూర్తి చేశాడు. ఆ తరువాత వెంటనే సంగీత కచేరీలు ఇవ్వటం ప్రారంభించాడు.

సంగీతంలో అంత పట్టు లేకపోవడంవల్ల అతని కచేరీల్లో ఆ లోటు స్పష్టంగా కనిపించసాగింది. కచేరీలకు వచ్చిన వారు శ్రీధర్ శర్మ మొహం మీదే “ఇదేం సంగీత కచ్చేరి” అని విమర్శించసాగారు.

ప్రేక్షకుల నుంచి ఇటువంటి విమర్శలు రావటంతో శర్మ ఖంగు తిన్నాడు. వెంటనే కథ గురువు దగ్గరకు వెళ్లి జరిగినదంతా వివరించాడు. క్షమాపణ కోరాడు.

అప్పుడు గురువు “నడక నేర్వకుండా పరుగు కోసం తాపత్రయ పడితే ఇటువంటి అనుభవాలే ఎదురౌతాయి” అని హితబోధ చేశారు. శ్రీధర్ శర్మ చేసిన తప్పుకు చింతించాడు.

అన్నింటికీ దగ్గర దారులు ఉండవని గ్రహిం చాడు. మళ్లీ పాఠశాలలో మొదటి నుంచి సంగీత సాధన ప్రారంభిం చాడు. సంగీతంలో ప్రావీణ్యం సాధించాడు.

గురువు గారి ఆశీస్సులు పొందాడు. ఆ విధంగా శర్మ తను అనుకున్న లక్ష్యం నెర వేర్చుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment