మంచి మనసు | Telugu story apps for kids

మంచి మనసు

Telugu story apps for kids: అనగనగా ఒక ఊరిలో చంద్రం అనే యువ కుడు ఉండేవాడు. అతనికి ఈత అంటే చాలా ఇష్టం. ఊరి చివర ఉన్న నదికి వెళ్లి ప్రతిరోజూ ఈత కొట్టి వస్తుండేవాడు.

అదే ఊరిలో ఉండే నాగరాజు అనే కుర్రాడికి, చంద్రానికి మధ్య ఒకసారి చిన్న గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరూ ఎప్పుడు, ఎక్కడ ఒక ఎదురుపడినా కోపంగా చూసుకునేవారు.

నాగరాజుకు ఈత రాదు. ఎలా గైనా చంద్రంలాగ తాను కూడా ఈత కొట్టాలనుకున్నాడు. వీలైనప్పుడల్లా ఈత నేర్చుకోవటానికి వెళ్లడం మొద లుపెట్టాడు.

ఒకరోజు సాయంత్రం చంద్రం తన స్నేహితుడితో కలిసి ఈత కొట్టడానికి నదికి వెళ్లాడు. ఆ రోజు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఇంత ఉదృతంగా ప్రవహిస్తున్న నదిలో ఈత కొట్టటం చాలా ప్రమాదం’ అను కుంటూ చంద్రం, అతని స్నేహితుడు ఇంటికి బయలుదేరారు.

ఇంతలో వారికి నాగరాజు ఎదురుపడ్డాడు. ఎప్పటి లాగే చంద్ర నాగరాజు, కోపంగా చూసుకుంటూ ముఖాలు తిప్పుకున్నారు. నాగరాజు నది ఉద్ధృతంగా ప్రవహిస్తుం దనే విషయాన్ని గమనించకుండా నదిలో ఈతకు దిగాడు.

నీరు వేగంగా ప్రవహిస్తుండ టంతో నాగరాజు నదిలో కొట్టుకుపోసాగాడు. ప్రాణభయంతో “రక్షించండి… రక్షించండి…” అని అరిచాడు.

ఆ అరుపులు విన్న చంద్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదిలోకి దూకాడు. నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న నాగరాజును రక్షించి ఒడ్డుకు చేర్చాడు.

తనని చంద్రం కాపాడినందుకు రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపాడు నాగరాజు. ఇంటికి వెళ్తున్నప్పుడు… చంద్రాన్ని అతని మిత్రుడు “నువ్వు, నాగరాజు గొడవ పడ్డారు కదా.

మరి అతన్ని రక్షించటానికి నీ ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా నదిలోకి దూకావు. ఎందుకు?” అని అడిగాడు. అప్పుడు చంద్రం “నాకు ఈత వచ్చి కూడా నా కళ్ల ముందు ఈతరాని వాడు నీటిలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండలేక పోయాను.

ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే? అతన్ని రక్షించే అవ కాశం ఉండి కూడా రక్షించలేకపోయాననే బాధ నన్ను జీవితాంతం వేధించేది.

ఆ బాధ భరించడం కన్నా కొద్ది నిముషాల తెగింపు నయం కదా! పైగా శత్రువు అయినా సరే ప్రాణాపాయంలో ఉంటే రక్షించి తీరాలి అన్నాడు చంద్రం. అతడి మంచిమన సును మిత్రుడు అభినందించాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment