పిచ్చుక – కాకి | Telugu story audiobooks for kids

పిచ్చుక – కాకి

Telugu story audiobooks for kids: ఒక అడవిలో ఒక పిచ్చుక ఒక కొమ్మ మీద గూడు కట్టుకుని తన పిల్లలతో ఉండేది. వానాకాలం వచ్చింది. ఒకరాత్రి కుండపోతగా వర్షం కురవడం మొదలైంది.

బలంగా వీచిన గాలులకు పిచ్చుక గూడు దూరంగా ఎగిరిపోయింది. పిచ్చుక పిల్లలు వర్షానికి తడిసిపోసాగాయి. పిచ్చుక తన పిల్లలను తీసుకుని కాకి ఇంటికి వెళ్ళి తలుపు తట్టింది. “ఎవరూ?”

అంటూ లోపలి నుండి అడిగింది కాకి. “కాకమ్మా నేను. వానగాలికి నా గూడు చెదిరిపోయింది. నా పిల్లలు వర్షానికి తడిసిపోతున్నాయి.” అంది పిచ్చుక.

“అయితే నేనేం చేయాలి?” అంటూ ప్రశ్నించింది కాకి. “వర్షం ఆగేవరకు నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వు.” అంటూ ప్రాధేయపడింది పిచ్చుక. “నా పిల్లలు వెచ్చగా పడుకుని ఉన్నాయి.

నేను తలుపు తియ్యలేను” అని నిర్దాక్షిణ్యంగా చెప్పింది కాకి. దానితో పిచ్చుక తన పిల్లలను తీసుకుని కొత్త ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది.

కొద్దిరోజులు గడిచాయి. ఒకరోజు పిచ్చుక ఇంటి తలుపు ఎవరో తట్టడం విని “ఎవరు?” అడిగింది. “పిచ్చుకమ్మా నేను కాకిని. నా ఇల్లు వర్షానికి కూలిపోయింది.

నా పిల్లలు తడిచిపోతున్నాయి. దయచేసి తలుపు తీస్తే ఈ రాత్రికి నీ ఇంట్లో ఉంటాను.” అంది కాకి బయట నుంచి. పిచ్చుక వెంటనే తలుపు తీసింది.

కాకి పిల్లలను తన రెక్కలలో ముడుచుకుని లోపలికి తీసుకు వచ్చింది తన పిల్లల దగ్గర ఉంచింది. గతంలో పిచ్చుకతో తను ఎలా ప్రవర్తించిందో గుర్తుకు వచ్చి కాకి సిగ్గుతో తల వంచుకుంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment