దొంగ చెప్పిన నీతి | Telugu story books for kids

దొంగ చెప్పిన నీతి

Telugu story books for kids: మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. ” కానీ, దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేదికాదు.

నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు నేను బానిసలా బత కాల్సి వస్తోంది’ అని ఎప్పుడూ అనుకునేది.

అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది. ఒక రోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢనిద్రలో ఉన్నాడు.

దొంగ చేతికం దిన వస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ, యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు.

తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో ‘అయ్యా! అదే చేత్తో నా కట్లు విప్పదీయండి’ అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ ‘నీ కట్లు విప్పితే నాకేంటి లాభం?’ అన్నాడు.

అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా ‘కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్లు. జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను’ అని ప్రాధేయప డింది.

దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి, చిన్నగా నవ్వాడు. ‘నేను దొంగను. నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి.

నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు. అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు.

నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాతి నుంచీ అది యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment