దానం | Telugu story CDs for kids

దానం

Telugu story CDs for kids: ఒక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టు బట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు.

అతడి. అవస్థకు జాలిపడి తన చేతిలోఉన్న పట్టు బట్టల్ని ఇచ్చేశాడు. మర్నాడు రాజు అటుగా వెళ్లిన ప తాను బహూకరించిన పట్టు బట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపగించుకున్నాడు.

కొద్దిరోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఓ రాజోద్యోగికి బహూక రించాడు గురువు.

ఆ విషయం రాజుకు | తెలిసి వెంటనే గురువుని పిలిచి… ‘మీమీద గౌరవంతో నేను బహుమతులు ఇస్తుంటే. వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచే యడం పద్ధతిగా లేదు’ అని కోపంగా • అడిగాడు రాజు.

బదులుగా… ‘దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నా రంటే, ఆ వస్తువు మీది అనే ఇంకా భావిస్తున్నట్లు.

ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగు తున్నారు కాబట్టి చెబుతున్నాను…. ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపించింది. అందుకే వారికి ఇచ్చేశాను.

అంతే తప్ప మీపైన గౌరవం లేక కాదు’ అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ. కోరాడు రాజు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment