అసలు విషయం | Telugu story competitions for kids

అసలు విషయం

Telugu story competitions for kids: వెంకట్‌తో పెళ్ళి నిశ్చయమయినప్పటి నుంచి అఖిల తెలియరాని ఆందోళనకు గురైంది. ఎందుకంటే వెంకట్‌కి చదువు పెద్దగా లేదు, పైగా చేస్తున్నది. వ్యవసాయం.

ఈ సంగతి తన ఫ్రెండ్స్‌కి తెలియగానే వాళ్ళం దరూ చూస్తారేమోనని భయం. చులకనగా అఖిల తన ఫ్రెండ్స్ అందరూ ఫారిన్ సంబంధాలు చేసుకుని హాయిగా ఉన్నారు.

వాళ్ళందరి ఇళ్ళల్లో అన్నీ ఫారిన్ ‘ వస్తు వులే, కట్టూబొట్టూ అంతా హైక్లాసుగానే అంటుంది మరి. తన సంబంధం గురించి ఫ్రెండ్స్‌కి ముందే చెపితే సమస్యే లేదనుకున్న అఖిల అందరికీ చెప్పేసింది.

“యు ఆర్ రియల్లీ గ్రేట్” అంటూ అందరూ అఖిలని ఒకటే పొగిడేశారు. తనని ఆటలు పట్టిస్తున్నారనుకున్న అఖిల “ప్లీజ్.. చులకన చేయకండే ఉన్న విషయం చెప్పానంతే.. ఇంకా నేనతన్ని పెళ్ళి చేసుకోలే దుగా!” అంది.

“అఖిలా! మేం నిజం గానే నిన్ను అభినంది స్తున్నాం.. నీ ఎంపిక చాలా బాగుంది. నిజా నికి మేమందరం ఫారిన్ సంబంధాలని మోజుపడి చేసు కున్నాం, కానీ ఎంతో అసంతృ ప్తితో బతుకుతున్నాం.

సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేక పోతున్నాం. మేం చేసుకున్న వాళ్ళు అక్కడ వెలగబెట్టేవి చిన్నా చితక మున్సిపాలిటీ ఉద్యోగాల్లాంటివే. దేశంకాని దేశంలో, కుక్కిన పేనుల్లా, అభద్రతాభావంతో ఉద్యోగాలు చేస్తూ బతకాలి.

కానీ నువ్వు చేసుకునే వెంకట్ తను పుట్టి పెరిగిన ఊళ్ళోనే దర్జాగా స్వంత వ్యవసాయం చేసుకుంటూ పదిమందికీ సాయపడుతూ మహారాజులా ఉన్నాడు.

అంతకన్నా కావల్సిం దేముంటుందే!” అన్నారు. వారి మాటలకి వెంకట్ మరింత ఉన్నతంగా కనిపించాడు అఖిలకి. ఆమె మనసంతా ఆనం దంతో నిండిపోయింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment