అహంకారం | Telugu story drama for children

అహంకారం

Telugu story drama for children: జపాన్ దేశాన్ని టాంగ్ వంశీయులు పరిపాలిస్తున్న కాలంలో వారివద్ద ఒక గొప్ప రాజనీతిజ్ఞుడైన మంత్రి వుండేవాడు. సైనిక విషయంలో, పరిపాలనా విషయంలో అపారమైన మేధాశక్తి గలవాడు.

అన్ని వున్న ఆయన బౌద్ధ ధర్మాలను తు.చ. తప్పక పాటించేవాడు. ఒక గురువుగారికి సేవ చేసేవాడు. ఒకసారి ఆయన ఒక ఆచార్యుని సందర్శించాడు.

ఆయన బుద్ధుని బోధనలను దీక్షగా పాటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినవాడు. ఆచార్యునికి నమస్కరించి, “అయ్యా, బుద్ధ బోధనల ప్రకారం అహంకారం అంటే ఏమిటో వివరించండి” అని ప్రార్థించాడు.

అతడు అడిగిన దానికి ఆచార్యుని ముఖం ఎర్రబడింది. “ఏం ప్రశ్న అది? తెలివి తక్కువ “ప్రశ్న” అన్నాడు. అనుకోని సమాధానానికి మంత్రి మొదట నివ్వెరబోయాడు.

తర్వాత అతని నిర్లక్ష్యానికి విపరీతంగా కోపం వచ్చింది. కళ్ళు ఎర్ర బారాయి. ముఖం జీవురించింది. అతనిలో వచ్చిన మార్పును చూసి చిరునవ్వుతో ఆ ఆచార్యుడు, “అహంకారం అంటే ఇదే” అన్నాడు. మంత్రి సిగ్గుతో తలదించుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment