ప్రియమైన శత్రువులు | Telugu story quizzes for kids

ప్రియమైన శత్రువులు

Telugu story quizzes for kids: రామచంద్రరావు, సోమేశ్వర్రావు చూడటానికి స్నేహితుల్లా ఉంటారే కానీ లోపల్లోపల ఒక రంటే ఒకరికి ద్వేషం. ఒకరిని ఒకరు చెడగొట్ట డానికి ఎన్ని ప్లాన్లు వేసినా పైకి మాత్రం నవ్వుతూ ఏం తెలియనట్లు ఉండేవారు.

రామచంద్రరావు పరమ లోభి. అలాంటిది సోమేశ్వ రావుకు మాత్రం తన ఇంట్లో ఎవరిదో ఒకరిది పుట్టినరోజు, పండగ, అదని ఇదనీ ఏదో ఒక కారణం చెప్పి ఇంటికి ఆహ్వానించి తీపి పిండివం టలు బతిమాలి మరీ తిని పించేవాడు.

సోమేశ్వరావు మహదానందంగా వచ్చి తినిపోయేవాడు. ఊళ్లో జనానికి వీళ్ల వ్యవ హారం ఒకపట్టాన అంతుపట్టేది కాదు. వీరిద్దరి వ్యవహారం అర్థంకాని వారిద్దరికీ మిత్రుడైన ఒకతను ఈ విషయం సోమేశ్వరరా వునే అడిగేశాడు.

“మీరెక్కడి స్నేహిత లండీ బాబూ! అతగాడికి మీరంటే సరిపోదు. మీకతడంటే సరిపోదు. మరి ఈ విందులేమిటీ? అని సోమేశ్వరావు నవ్వి పీనాసితనం అందరికీ తెలిసిందే!

వాడి సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలి అందుకే తింటున్నా” అన్నాడు. ఆ మిత్రుడు రామచంద్ర రావునీ ఇదే ప్రశ్న వేశాడు.

రామచంద్రరావు పకపకా నవ్వి ‘సోమేశ్వరంగాడికి షుగర్ వ్యాధి ఎంత ఎక్కువగా స్వీట్లు తినిపిస్తే అంత త్వరగా ‘టపా’ కట్టేస్తాడు. అందుకే తినిపిస్తున్నా” అన్నాడు. ఉంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment