కపట స్నేహం | Telugu story sessions for kids

కపట స్నేహం

Telugu story sessions for kids: రామాపురానికి దగ్గరలో ఒక చిట్టడవి ఉంది. ఆ | అడవిలో జంతువులు ఎంతో స్నేహంగా ఉండేవి. అవి నీళ్ళు తాగడానికి అడవిలో ఒక వాగు కూడా ఉంది.

జిత్తులమారి నక్కకు ఒకరోజు అర్థరాత్రి బాగా | ఆకలైంది. తినడానికి ఏమైనా దొరక్క పోతుందా అని అడవిలో ఉన్న వాగు దగ్గరకు వచ్చింది.

అయితే, అక్కడ కొంగ | ఒకటి జపం చేసు కుంటూ కనపడింది. | నక్క కొంగ దగ్గరకు పోయి ఏంటి బావా ఇంత అర్ధరాత్రి జపం చేస్తున్నావని అడిగింది.

అందుకు కొంగ జపం చేయడానికి ఇదే మంచి సమయం బావా అని సమా ధానం ఇచ్చింది. ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది.

ఒకరోజు మాఇంటికి రా బావా అని కొంగను పిలి చింది నక్క. సరే అని కొంగ ఒకరోజు నక్క బావ * ఇంటికి వచ్చింది. కొంగ బావకు ఎంతో మర్యాదలు చేసి భోజనానికి కాళ్ళు చేతులూ కడుక్కోమంది నక్క.

చిట్టి కథ లోపలకు వచ్చిన కొంగకు పెద్ద పళ్ళెం నిండా వేడివేడిగా ఉన్న పాయసం వడ్డించింది నక్క. వేడివేడిగా ఉన్న పాయ సాన్ని ముక్కుతో ఎంత పొడిచినా తినడానికి వీలుకా లేదు.

దాంతో, కొంగకు నక్క బావ అతి తెలివి అర్థ మైంది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా, ఎంతో ప్రేమగా నక్కను ఇంటికి రమ్మంది కొంగ. సరే అని కొంగ ఇంటికి వచ్చింది నక్క.

బావకు సకల మర్యాదలు చేసి కాళ్ళు కడుక్కోడానికి చెంబుతో నీళ్ళిచ్చింది కొంగ. పెద్ద పీట వేసి నక్క బావ ముందు పెద్ద కూజాను ఉంచింది.

బావా నీకు ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేశాను తిను బావా అని నక్కతో చెప్పింది కొంగ. ఎత్తుగా ‘ సన్నటి మూతితో ఉన్న కూజాను చూసి దాంట్లో ఉన్న చేపల పులుసు ఎలా తినాలో తెలియక ఊరు కుంది నక్క.

కొంగ మాత్రం ఒక్కో చేపను ముక్కుతో తీసుకుని చకచకా లాగించేసింది. కొంగను భోజనానికి పిలిచి తాను చేసిన అమర్యాద అప్పుడు నక్కకు గుర్తు వచ్చింది. ఇక నుంచి ఎవరితోనూ కపట స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment