బుద్ధిహీనులు | Telugu story videos for kids

బుద్ధిహీనులు

Telugu story videos for kids: ఒకనాడు ఒకరైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంతా తిరిగినా, వాళ్ళకు నచ్చిన వస్తువేదీ అక్కడ దొరకలేదు. చిట్టచివరకు వాళ్ళు గుర్రాలవద్దకు వెళ్ళారు.

అక్కడ ఒక నల్లగుర్రం రైతుకు బాగానచ్చింది. కొడుకు గూడా ఒప్పుకొన్నమీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితోబాటుగా కొంతదూరం నడిచే సరికి వాళ్ళకి నీరసంవచ్చింది.

అందుచేత వాళ్ళిద్దరూ గుర్రమెక్కి యింటికి పోసాగారు. దారిలో, వాళ్ళని చూచి కొందరు “ఆహా! ఎంతచక్కని గుర్రము! కాని పాపం అది ఎందుకో విచారంగా ఉంది.

పోతుల్లాంటి యిద్దరు మనుషుల్ని అది మోయలేక పోతోంది కాబోలు” ‘అన్నారు. ఆ మాటలు విన్న తండ్రీ కొడుకులకు చాల సిగ్గనిపించింది.

కుమారుణ్ణి గుర్రంపై కూర్చోబెట్టి తాను ప్రక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడిజనం వీళ్ళని చూచి “కొడుకెంత దుర్మార్గుడో!

ముసలితండ్రి నడచివస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చొన్నాడు. ఎంతసిగ్గు చేటు!” అంటున్నారు. వెంటనే కొడుకు క్రిందకి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు.

ఊరిచివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారు వీళ్ళనిచూచి “ముసలివాడెంత దుర్మార్గుడో! పాపం పసివాడు!

కొడుకును ఎండలో నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీచేస్తున్నాడు” అన్నారు. వారి మాటలకు సిగ్గుపడి తండ్రి కూడా గుర్రంగి న వడసాగాడు.

వాళ్ళకు ఈ గుర్రంతో చాల అవమానం కలిగి ఎట్లాగైనా ఆ గుర్రాన్ని వదిలించుకొంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అట్లా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటవల్సి వచ్చింది.

వంతెనపైకి రాగానే యిద్దరూ కలసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత “హమ్మయ్య! ఈ గుర్రంపీడ వదిలింది” అనుకొని యిద్దరూ ఆనందంగా యింటికి చేరుకొన్నారు. వారికి సొమ్మునష్టపోయామనే చింతేలేదు.

నీతి :- చెప్పుడు మాటలు విని చెడిపోకు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment