అందం-ఆనందం | Telugu story worksheets for kids

అందం-ఆనందం

Telugu story worksheets for kids: ఒక ఊళ్లో ఒక కమ్మరి ఉండేవాడు. అతడు తన కొలిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు నాగళ్లు చేశాడు. మొదటి నాగలి నన్ను ఎవరికైనా అమ్మివేయి.

పొలం దున్ని పంట సాగుకు ఉపయోగపతాను’ అంది. రెండో నాగలి మాత్రం ‘నన్ను ఎవరికీ అమ్మవద్దు. నీ దగ్గరే ఉంటాను. నేను పని మాత్రం తుప్పు పట్టి ఒక చేయలేను’ అంది.

అవి కోరినట్లే కమ్మరి మొదటి నాగలిని ఓ రైతుకు అమ్మేశాడు. రెండో నాగలిని తన శాలలో ఓ మూలన పడేశాడు. కొంత కాలానికి ఏదో పనిమీద రైతు నాగలి పట్టుకుని కమ్మరి దగ్గరకు వచ్చాడు.

ఆ నాగలి కొన్నప్పటికంటే తళ తళా మెరుస్తోంది. కమ్మరి దగ్గరే ఉన్న నాగలి మూలన పడి ఉంది. ‘మనమిద్దరమూ ఒకే ఇనుప ముక్క నుంచి తయారయ్యాం.

నేనేమో తుప్పు పట్టి ఇలా అధ్వానంగా ఉన్నాను. నువ్వేమో ఎంచక్కా మెరుస్తున్నావు ఎందుకు?’ అని అడిగింది. బదులుగా… ‘నా యజమాని నా రోజూ పొలం దున్ని నన్ను సానబెడతాడు.

కానీ నీకా అవకాశం లేదు. కాబట్టి ఎప్పటిలాగే ఉండిపోయావు. ఇప్పటికైనా పనిచేయడంలోనే అందం, ఆనందం ఉన్నాయని గ్రహించు’ అని చెప్పింది.

మొదటి నాగలి. ఆరోజే మూలనున్న నాగలి తనని కూడా ఎవరైనా రైతుకి అమ్మి వేయమని కమ్మరితో చెప్పింది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment