సుదోపసుందులు | Telugu story workshops for kids

సుదోపసుందులు

Telugu story workshops for kids: వింధ్యాటవీ ప్రాంతంలో కుంభకుడనే రాక్షసుడొకడు వుండేవాడు. వాడికి సుందుడు ఉపసుందుడు అనే రాక్షస పుత్రులున్నారు.

వారిద్దరూ పెరిగి పెద్దయి తండ్రిలాగే ఋషులు, తపోధనులను ఏడిపిస్తుండేవారు. ఒక | రోజు ఒక ముని ఈ సోదరు లిద్దరినీ గాంచి “నాయనా! మీ దనుజ ధర్మం పాటిస్తున్నారు బాగానే వుంది.

ఏ | మహర్షి మీ ఆగడాలు చూసి శపించాడంటే మీరు శాప గ్రస్తులైపోతారు. అటువంటి దుస్థితి కలగకుండా వుండాలంటే | బ్రహ్మను గూర్చి తపస్సు చేసి ఆయన్నుంచి విచిత్ర వరాలు పొందండి.” అని సలహా యిచ్చాడు.

ఆయన మాట ప్రకారం ఆ సోదరులు వింధ్యాటవిలో ఘోర తపస్సు ప్రారంభించారు బ్రహ్మకోసం! బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు కోరుకోమన్నాడు.

నర, కిన్నెర, యక్ష, గంధర్వ, రాక్షస, క్రూర జంతులచే చావు లేకుండా వరమియ్యి; ప్రకృతి ప్రళయాలతో చావకూడదు, మాయంతట మేమే చావాలని కోరుకున్నారు.

వారు | అమరత్వం గూడా కావాలన్నారు. అవి అన్నీ విన్న బ్రహ్మ అమరత్వం మినహా అన్ని వరాలు ఇచ్చి వెళ్ళమన్నాడు. ఆ వర గర్వంతో ఆ సోదరులు విజృంభించి మునులను, తపోధనులను, యోగ్యులను, పండితులను, సత్సీలురను మరింత హింసలు పెట్ట సాగారు.

దేవతలను, దేవ కన్యలనుగూడా నానాబాధలు పెడుతున్నారు. వారంతా కలసి బ్రహ్మ వద్దకు వచ్చి “విధాతగారూ! వారి మంచి చెడ్డలు విచారించకుండా ఎవరేది కోరితే ఆ వరాలు ఇచ్చేసి మా ప్రాణం మీదకి తెచ్చావయ్యా….!

ఆ రాక్షస సోదరులైన సుదోపసుందులు బరి తెగించి రెచ్చిపోతున్నారు. వారి | పెట్టే బాధలు మేము భరించలేక పోతున్నాం. మాకేదైనా విముక్తి మార్గం కల్పించు” అని వేడుకున్నారు.

అంతట బ్రహ్మ తీవ్రంగా ఆలోచించి సృష్టిలో వున్న ప్రతి జీవిలోనుంచి ఒక తిలప్రమాణం మంచిని తీసి | భువనైక సుందరిని ఒకామెను సృష్టించాడు.

తిలప్రమాణంగా తీసుకున్న కారణంగా ఆమెకు తిలోత్తమ అని పేరుంచాడు. “తిలోత్తమా! నీవు దనుజ లోకంలోకి వెళ్ళి సుదోపసుందులనే ఇద్దరు సోదరులు వున్నారు.

వారిని మోహించు. వారిద్దరూ నిన్ను కోరతారు వారిలో ఎవరు యుద్ధం చేసి గెల్చి వస్తే వారిని నేను వివాహమాడతానని చెప్పు” అని పంపించాడు బ్రహ్మ.

తిలోత్తమ వెంటనే రాక్షస లోకం చేరి రాక్షసులు ముందు నృత్యం చేయ సాగింది. అలా తిరిగి తిరిగి చివరకు సోదరులైన సుందోపసుందుల వద్దకు వచ్చి నాట్యం చేసింది.

ఆమె నాట్యం చూసి యిద్దరూ మోజు పడ్డారు. “నన్ను పెళ్లాడు! కాదు నన్నే పెళ్లాడు” అంటూ సోదరులిద్దరూ తగులాడుకున్నారు.

“మీరు యిద్దరూ యుద్ధం చేసి ఎవరు గెలిచి వస్తే వారిని నేను పెళ్లాడుతాను!” అని షరతు పెట్టింది. తిలోత్తమ. అంతదాకా ఎంతో అన్యోన్యంగా వున్న సోదరులిద్దరూ ఈ అందగత్తె కోసం యుద్ధం మొదలు పెట్టారు.

త్వంలో, శూరత్వంలో ఒకరికొకరు తీసిపోరు. రెండు భయంకరమైన కొండలు ఢీ కొంటున్నట్లు పోరుసల్పారు వారిద్దరూ. ఒకరి మీద మరొకరు బండలు విసురుకున్నారు.

చెట్లు పీకి కొట్టుకున్నారు. ఆ విధంగా పది రోజులు నిర్విరామంగా పోరాటం జరిపి ఒడలంతా రక్తమయమైపోయింది. నీరసించి పోయారు వారు వారి పట్టుదల పెరిగిందేగానీ తరగలేదు.

తుదకు ముష్టి యుద్ధంతో ఒకరికొకరు తలపడి బలమైన ముష్టిఘాతాలతో కొట్టుకుని | ఒకర్నొకరు ఒక్కసారే చంపేసుకున్నారు! అంతట తిలోత్తమ సత్యలోకం వెళ్లి “విధాతా! మీరు నాకు యిచ్చిన కార్యం జయప్రదంగా ముగించాను!” అన్నది.

“భేష్ తిలోత్తమా! ఆ సోదరులిద్దరూ నీ కోసం పోరాడి ఒకర్నొకరు చంపుకున్నారు. మరొకరి వల్ల చావు లేకుండా వరమిచ్చాను.

ఆ వరం యిప్పుడు నెరవేరింది! నీవు స్వర్గలోకంలోకి వెళ్లి ఇంద్రుని దర్బార్లో నాట్య కళలను ప్రదర్శిస్తూ వుండు!” అని తిలోత్తమకు స్వర్గ వాసం కల్పించాడు బ్రహ్మ!

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment