నిజమైన భక్తి | Telugu storytelling events for kids

నిజమైన భక్తి

Telugu storytelling events for kids: ఒక కొండపైన ఆలయం ఉంది. అల యానికి వెళ్లే మార్గం చాలా కఠినంగా ఉండేది. ఒకరోజు, ఆలయ ప్రధాన పూజారి చనిపోయాడు.

ఆలయ నిర్వా హకులు కొత్త పూజారిని నియమిం చడం కోసం పరీక్షలు నిర్వహించారు. “క్షమించండి! నేను రావడానికి ఆలస్యం అయ్యింది.

నేను కూడా పూజారి అభ్యర్ధిని” అని పరిచయం చేసుకున్నాడు ఒక యువకుడు. “ఎందువల్ల ఆలస్యమైంది?” అని ప్రశ్నించారు పరీక్ష నిర్వాహకులలో ఒకరు.

“నేను ముందుగానే బయలు దేరాను. ఆలయానికి వచ్చే మార్గం. రాళ్లు రప్పలతో ఉండడం వల్ల రాళ్లు తీసివేసి వస్తున్నాను. దీంతో చాలా సమయం వృథా అయింది” అని చెప్పాడు యువకుడు.

అతని సమాధానం పూజారిని ఎంపిక చేసే సభ్యులకు నచ్చింది. “నీకు పూజలు చేయడం వచ్చా?” ప్రధాన సభ్యుడు అడిగాడు.

“నేను నిత్య ప్రార్ధనలు చేస్తాను. విగ్రహాలను శుభ్రం చేయడం, గు వత్తులు ముట్టించడం, నైవేద్యం పెట్టడం వంటివి వచ్చు” సమాధాన మిచ్చాడు యువకుడు.”

“నీకు వేదమంత్రాలు తెలుసా?” మరొక సభ్యుడు ఆడిగాడు. “తెలియదు” అని చెప్పాడు. యువకుడు. సభ్యులు కాసేపు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

తరువాత ఆ యువ కుడినే ఆలయ పూజారిగా ఎంపిక చేస్తు న్నట్టు ప్రకటించారు. “ఏ ప్రార్థనైనా నిజమైన భక్తితో చేయబడితే అది వేదమంత్రాలతో సమానం.

నీకు వేద మంత్రాలు బోధించే ఏర్పాటు కూడా చేస్తాం” అని యువ చెప్పారు. సభ్యులు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment