ఏనుగు గర్వభంగం | Telugu stories for children

ఏనుగు గర్వభంగం

ఒకసారి ఒక ఏనుగు అడవిలోంచి పోతూ ఒక చీమల పుట్టమీదకాలు వేసింది. వెంటనే ఆ చీమలన్నీ ఒక్కసారిగా “ఎవతెవే నీవు?

పెద్దశరీరం ఉన్నంత మాత్రాన బుద్ధి ఉండకృళ్లేదా? మాపుట్టను ఎందుకిలా నాశనం చేశావు” అని అరిచాయి.

దానికి ఆ ఏనుగు నవ్వుతూ “ఎవరే ఆ మాట్లాడేది? నాకు కన్చించడమేలేదుగాని మాటలు మాత్రం విన్పిస్తున్నాయి-అంత చిన్న ప్రాణులు మీరు.

‘ప్రాగరుబోతుల్లారా! మీరు నన్ను ఎదిరిస్తారా?” అంది. తర్వాత చీమలన్నీ కూడబలుక్కుని “ఎలాగైనా ఆ ఏనుగు పొగరు అణచాలి” అని

ఒక ఆలోచనచేశాయి. వెంటనే అవి ఏనుగు కాళ్ళపైకి ఎక్కికుట్ట సాగాయి. ‘ఏనుగుచర్మం దళసరిగా ఉంటుంది కదా! దానికేమీ బాధకలగలేదు.

అప్పుడొక తెలివైన ఎజ్జనీమ “ఏనుగుకళ్ళు చాలసున్నితంగా ఉంటాయి. అక్కడ కుడితే దానికి బాధ తెలుస్తుంది. మీరు కళ్ళవద్దకు వెళ్ళండి. నేను దాని చెవిలోకి వెళ్తాను” అంది.

వెంటనే చీమలన్నీ దాని కళ్ళవద్దకు వెళ్ళి కుట్టసాగాయి. బాధతో కళ్ళుమూసుకొని, ఏనుగు గుడ్డిదానిలాగ గంతులు వేయడం మొదలుపెట్టింది.

ఏడుస్తోంది. అరుస్తోంది. చెవిలోనున్న చీమ దాన్ని ఒక్కసారికుట్టి” ఏం, ఇప్పుడు తెలిసిందా చిన్న ప్రాణులతదాఖా! ఇప్పుడుచెప్పు మాశక్తిగొప్పదా నీశక్తి గొప్పదా!” అంది.

చీమలు కుట్టి కుట్టీ ఏనుగును గుడ్డిదాన్ని చేశాయి. దారితెలియక ‘ఒకచెట్టును ఢీకొట్టి క్రిందపడి మూర్చబోయింది.

“అల్పులమని మమ్మల్ని యీసడించిన ఆ ఏనుగు గతి ఏమైందో చూడండి” అని చీమలన్నీ సంతోషంతో గంతులువేశాయి.

నీతి; శక్తికన్నాయుక్తే గొప్పది

Neethi kathalu in telugu with moral

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment