నక్క – కోడిపుంజు | Moral stories in Telugu to write

నక్క – కోడిపుంజు

Neethi kathalu in telugu with moral

ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడేనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు.

కన్పించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకొంది. మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి,

నుండి నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి ‘స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లాగ మసులుకొందాం!” అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకుతెల్సు. అందుచేత అది “అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది.

లోలోపల కోడిపుంజు నక్కబారినుండి ఎలాతప్పించుకోవాలో ఆలోచిస్తోంది. చివరకు యిలా అంది.. “అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని గూడా రానీ! అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!”

“ఈదారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నారు?” అని అడిగింది నక్క

“వేటకుక్కలూ, వాటి స్నేహితులూ” జవాబిచ్చింది పుంజు,

వేటకుక్కలపేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం. మొదలెట్టింది. “వాటి కంటబడితే చావడం ఖాయం” అనుకొన్నది నక్క

“అలా భయంతో వణకిపోతున్నావెందుకు?” అని అడిగింది కోడిపుంజు

అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటివార్త వినలేదేమో అనుకొంటా” అంటూ పరుగెత్తి పారిపోయింది.

నీతి:- మోసాన్ని మోసంతోనే జయించాలి

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment