మోసకారి నక్క | Short Moral story for kids

మోసకారి నక్క

ఒకరోజున ఒక కాకికి ఒకమాంసం ముక్క దొరికింది. అది ఎగిరివెళ్ళి ఒక చెట్టుపైన కూర్చొని హాయిగా తిందామని అనుకొంటోంది.

అదే సమయంలో a8 నక్క అటునుండిపోతూ, చెట్టుపైనున్న కాకిని, దాని నోట్లో మాంసం ముక్కనీ చూసింది. ప్రొద్దుటినుండి దానికి తినడానికి ఏమీ దొరకలేదు.

ఏదో విధంగా ఆ మాంసంముక్కను సంపాదించి హాయిగా యీపూట గడుపుకోవాలి” అనుకొంది నక్క తలచుకొన్న కొద్దీ నోట్లో నీళ్ళూరుతున్నాయి దానికి.

చెట్టుకు దగ్గరగా వెళ్ళి కాకితో మాట్లాడ్డం మొదలుపెట్టింది. “ఈరోజున నువ్వుచాల అందంగా కన్పిస్తున్నావు” అంది. కాని కాకి ఏమీ బదులివ్వలేదు.

నోట్లో మాంసం ముక్కతో ఎలా మాట్లాడాలి?” అని అనుకొని ఊరుకుంది. కాని నక్క వదిలిపెట్టలేదు. అది మళ్ళీ “ఎక్కడికి వెళ్ళి వస్తున్నావేమిటి? చాలా చలాకీగా కన్పిస్తున్నావు” అంది.

కాకి భయంకాకిది-“బాబోయ్‌! మాట్లాడితే మాంసం ముక్క పడిపోదూ!” అనుకొని మాట్లాడలేదు. మళ్ళీనక్క “చక్కటి చలికాలం వెళ్ళిపోయింది. వేసవి వచ్చేసింది.

నీవుపాడితే తప్ప నాకువినదానికి ఇంకెవరుపాడ్డారు? ఇంకెవరికి యింత చక్కటి గొంతు ఉంది?” అంది. నక్కపొగడ్తకి కాకి పొంగిపోయింది.

పాడకుండా ఉంటే, పాపం! నక్కబాధ 540०8. పోనీ! ఒక్కపాట Sm” అనుకొని కాకి నోరుతెరచి “కా” అని పాడటం మొదలెట్టింది.

వెంటనే నోటిలోని మాంసం ముక్క నేలమీద పడిపోయింది. ఇంకేం! తనకు కావల్సిన మాంసం ముక్కదొరికింది.

సంతోషంగా ఆ ముక్కను నోటకరచుకొని పరుగెత్తి పారిపోయింది నక్క “ఓసి! దొంగనక్కా! ఇందుకా నువ్వు, నన్ను అంతగా EAS పాడించావు?” అనుకొని కాకి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది.

నీతి :- పొగద్తలెప్పడూ పరుల స్వార్ధానికే!

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment