దొంగ-షావుకారు | A Telugu Moral Story

దొంగ-షావుకారు

Neethi Kathalu for Kids: రామాపురంలో ఒకరోజు రాత్రి ఒక దొంగ పరిగెత్తుకొంటూ వచ్చి షావుకారు దుకాణంలో దూరి… ‘షావుకారు గారు నన్ను రక్షించండి. నా ప్రాణం కాపాదండి. జమీందారు ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా రాజ భటుల కంటపడ్దాను.

భటులు ఈ తోవనే వస్తున్నారు. నన్ను వారి నుంచి రక్షిస్తే నేను దొంగిలించిన దబ్బులో సగం మీకు ఇస్తాను’ అని చెప్పాడు. ఆశతో షావుకారు దొంగను రక్షించేందుకు కొన్నాడు.

తలుపు చాటున దాక్కోమని దొంగకు సూచించాడు. ఆతోవన వచ్చిన రాజభటులు ‘దొంగ ఇటువైపు గానీ వచ్చాదా’ అని షావుకారుని ఆరా 4 తీశారు. ఎవరూ రాలేదని అబద్ధం చెప్పాడు షావు కారు.

దాంతో భటులు దొంగను. be వ వెళ్లిపోయారు. భటులు వెళ్లి పోయాక… దొంగని తన వాటా ఇమ్మంటూ ‘అడిగాఢు షావుకారు. ‘ఇదిగో నీ వాటా తీస్తున్నా అని సంచిలోంచి కత్తి, తీశాడు దొంగ.

షావుకారి మెడపైన కత్తిపెట్టి… ‘నీకు బతకాలని ఆశ ఉంటే కేకలు వేయకు’ అని బెదిరించి అతడిని కుర్చీకి కట్టేసి దుకాణంలోని డబ్బుని కూదా సంచిలో వేసుకొని వెళ్లిపోయాడు, దొంగకు ఆశ్రయం కల్పించడం వల్ల తన డబ్బు పోయిందని లబోదిబో మన్నా! షావుకారు.

తాను నష్టపోయిన సొమ్ము గురించి రాజు గారికి ఫిర్యాదు చేస్తే దొంగకు సాయం చేసినందుకు తానే మళ్లీ చిక్కుల్లో పదాల్సి వస్తుందేమోనన్న భయంతో బయటకు చెప్పకుండా ఉండిపోయాడు. మరెప్పుడూ దుష్టులకి సాయం చేయకూడదనీ తప్పు మార్గంలో డబ్బు సంపాదించాలని ఆశపడకూడదనీ బుద్ధితెచ్చుకున్నాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment