సింహం చిట్టెలుక | Moral Stories in Telugu

సింహం చిట్టెలుక

Moral Stories in Telugu

సింహం – ఒకరోజున అడవిలోని చెట్టు నీడలో ఒక సింహం నిద్రిస్తోంది. ఆ ప్రక్కనే ఉన్న కన్నంలో ఒక చిట్టెలుక ఉంటోంది.

అది బయటికి వచ్చేసరికి పీచులాంటి. మెత్తని గడ్డి లాంటిది ఏదో అక్కడకుప్పలాగ పడిఉంది. “దానిపైకి ఎక్కి ఆడుకొంటే మజాగా ఉంటుంది” అనుకొని ఆ ఎలుక ఎక్కి సంతోషంగా ఎగురుతోంది.

కాని అది ఎక్కినది సింహంపైకి – అంతేగాని గడ్డికాదు. వెంటనే సింహానికి మెలకువ వచ్చింది. ఒక్కసారి గట్టిగా గర్జించింది. అటు యిటూ వెదకగా దాని చేతికి చిట్టెలుక చిక్కింది.

దాన్ని పంజాతో పైకెత్తి పట్టుకొని “ఎలుకముండా! నీకెంతడైర్యమే! నా నిద్రనంతా పాడుచేశావు. నిన్ను చంపేస్తాను” అంది సింహం. భయంతో ఎలుక గడాగడా వణకిపోతూ “క్షమించండి మహాప్రభో! నేను మిమ్మల్ని చూడలేదు.

ఏదోగడ్డి కదా అని ఎక్కి ఆడుకొంటున్నాను. దయచేసి నన్నువదిలేయండి. నేను ఎవ్వుడో ఒకవ్వుడు మీకు సాయంచేని బుణంతీర్చుకొంటాను” అంది.

చూస్తే వేలెడంతలేవు! నీవు నాకేంసాయం చేయగలవు? సరేలే! నిన్నిప్పుడు దయతలచి వదిలేస్తున్నా జాగ్రత్తగా ఉండు!” అని సింహం దాన్ని వదిలేసింది.

ఒకనాడు ఆ అడవిలో ఒక వేటగాడు ఒకవలపన్ని ఉంచాడు. పొరబాటున సింహం ఆ వలలో చిక్కుకొంది. ఏమీ చేయలేక దీనంగా అరవడం మొదలు పెట్టింది.

దాన్ని రక్షించడానికి ఎవ్వరూరాలేదు. అప్పుడే కన్నంలోంచి బయటికి వచ్చిన ఆ చిట్టెలుకకు ఆ సింహం అరుపు విన్పించింది.

అది సింహం గొంతును గుర్తుపట్టి ఒక్కపరుగున అక్కడికి చేరుకొని, “మహారాజా! భయపడకండి. నేను మీకు సహాయంచేస్తాను” అంది.

అటూఇటూ చూసింది వేటగాడు దగ్గరలో ఎక్కడాలేడు. వెంటనే వెళ్ళి వలతాళ్ళను ముక్కలు ముక్కలుగా కొరికిపారేసింది. సింహం అనందంగా బయటికి వచ్చి చిట్టెలుకను ఒకసారి పైకెత్తి ముద్దాడి వదలిపెట్టింది.

నీతి;- సహాయం చేయడాన్ని చిన్నా పెద్దా అనే తేడా లేదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment