కొంటె గాడిద | Short story for kids in telugu

కొంటె గాడిద

ఒక ఊళ్ళో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను ఉప్పు వ్యాపారం. తన వ్యాపారంకోసం అతడు ఒక గాడిదను కొన్నాడు. ప్రతిరోజూ ఉప్పుబస్తాల్ని గాడిద మీదవేసి బజారుకు తోలుకొని పోతూందేవాడు.

దినదినమూ యీ మూటల్ని మోయలేక గాడిద చాలబాధపడ్డూండేది. పనిచేస్తే ‘గానిపొట్ట గడవదు కాబట్టి ఆ మూటల్ని మోస్తుందేది.

ఒకరోజున గాడిదపై ఉప్పుబస్తాలు వేసి దాన్ని బజారుకు తోలుకొని వెళ్ళు తున్నాడు. వర్తకుడు కొంతదూరంపోయాక వాళ్ళకి ఏరుదాటవలసి వచ్చింది.

ఆ ఏరును దాటుతుండగా అనుకోకుండా గాడిద నీళ్ళలో ‘పదిపోయింది. నీటిలో పడ్డవెంటనే ఉప్పు కరగడం ప్రారంభించింది. వర్తకుడు ‘గాడిదను పైకి లేపాడు.

ఆశ్చర్యంగా బరువుతగ్గిపోయింది. ప్రాణం ఎంతో తేలికపడింది. ఉన్నఉప్పుకాస్తా నీటిపాలు అయ్యిందని అమ్మడానికి ఉన్న ఉప్పు చాలదనీ వర్తకుడు యింటికి తిరిగివచ్చేశాడు.

ఆ రోజున గాడిదకు బోలెడు విశ్రాంతి దొరికింది. మర్నాడు మరికొన్ని ఎక్కువ బస్తాలనువేసి వర్తకుడు గాడిదను బజారుకు, ‘తోలుకెదుతున్నాడు. మళ్ళీ చేరుకొన్నారు.

ఏరుదాటుతూ కావాలనే ఏటిలో పడిపోయింది గాడిద. బస్తాల్లోని ఉప్పంతా నీటిలో కరగిపోయింది. అప్పుడు వర్తకుడు అది కావాలనే నీళ్ళలో పడిందని గ్రహించాడు.

దాన్ని ఏమీ అనకుండా, కొట్టకుండా యింటికి తోలుకొని పోయాడు. గాడిదకు బుద్ధి వచ్చేలా చేయాలని రాత్రి బాగా ఆలోచించి ఒక పథకం (ప్లాన్‌) తయారుచేసుకొన్నాడు.

మర్నాడు ప్రొద్దుటే బస్తాలబరువును దానినడ్జిపైన వేసి, బజారుకు బయలుదేరాడు. దారిలో ఏరురావడం, గాడిద కావాలని మళ్ళీ నీటిలో మునగడం జరిగింది.

“ఉప్పేకదా!” అనుకొంది గాడిద కాని బస్తాల్లోది ఉప్పుకాదు-దూదికట్టలు. నీటితో తడిసి అవి బరువెక్కి పోయాయి. లేవలేక మూల్లుతున్న గాడీదను చూసి జాలిపడి వర్తకుడు కొన్ని బస్తాలను లాగిపడవేశాడు.

గాడిదలేచి మెల్లగా బయటికి వచ్చింది. బేళ్ళను పిండీ, నీరుపోయాక, వాటిని దానినడ్డిపైన వేసి బజారుకు తోలుకొని పోయాడు.

తనకు బుద్ధిచెప్పడానికే వర్తకుడు యిట్లాచేశాడని గాడిదకు తెలిసొచ్చింది. రోజు మొదలు మళ్ళీ ఎప్పుడూ అది అటువంటి తుంటరి పనులను చేయలేదు.

నీతి:- పొరబాటును అలవాటుగా మార్చుకోరాదు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment