టోపీలవర్తకుడూ – కోతులు | Traditional Telugu stories

టోపీలవర్తకుడూ – కోతులు

Traditional Telugu stories: వేసవికాలంలో ఒకరోజున ఒకటోపీల వర్తకుడు ఊరంతా తిరిగి కొన్నిటోపీలను అమ్ముకొన్నాడు. మిగిలిన టోపీల మూటతో వాడు ఆ ఊరి చివరనున్న ఒక చెట్టుక్రిందకు చేరాడు.

చెట్టునీడలో చల్లగా ఉంటుందని అక్కడ తలక్రింద మూట పెట్టుకొని పడుకొన్నాడు. ఇంతలో ఒక కోతులదండు ఆ చెట్టుమీదకు వచ్చింది.

వర్తకుని నెత్తిమీద టోపీ, అతని తలక్రింద ఏదోమూటా వానికి కన్పించాయి. మెల్లగా రెండుకోతులు దిగివచ్చి ఆ మూటను చెట్టుపైకి తీసుకొని పోయాయి.

అవి మూట చింపి చూస్తే అందులో రంగురంగుల టోపీలు ఉన్నాయి. క్రింద పడుకొన్నవాడొక టోపీ పెట్టుకొన్నాడు, అట్లాగే టోపీలను పెట్టుకొన్నవాళ్ళని కూడా పూర్వం అవిచూశాయి.

మనిషి ఏంచేస్తే, అదే చేయడాన్కి అవి ప్రయత్నిస్తాయి! వెంటనే ఒక్కొక్క కోతివచ్చి, తలొకటోపీని తీసుకొని తలపై పెట్టుకొని కొమ్మలపైన కూర్చున్నాయి ఏదో సభచేస్తున్నట్లుగా.. కొంతసేపటి తర్వాత ఆవర్తకునికి మెలకువ వచ్చింది.

చూస్తే తలక్రింద మూటలేదు. “అయ్యబాబోయ్! నాటోపీలమూటని ఎవరో ఎత్తుకొనిపోయారు” అనుకొంటూ దిక్కులుచూస్తూ, ఏడ్వడం మొదలుపెట్టాడు.

అడుగుదామనుకొంటే ఎవ్వరూ కన్పించడంలేదు. ఏదో చప్పుడు అయ్యిందిపైన. తలపైకెత్తి చూశాడు. చెట్టుమీద కోతులు ఒకదానిటోపీని మరొకటి మార్చుకొంటూ ఆనందంతో పరవశించిపోతున్నాయి.

కిచకిచమంటూ ఏదో మాట్లాడుకొంటున్నాయి. వాడు తనకోపాన్ని అణచుకోలేక గట్టిగా అరుస్తూ చంపేస్తానని చేత్తో బెదిరించాడు. కోతులు గూడా చేతులతో అట్లే చూపాయి.

క్రింద పడేసి తొక్కేస్తానని వర్తకుడు కాలితో నేలమీద తన్నాడు. కోతులు చెట్టుపైనే తన్నడం మొదలు పెట్టాయి. “ఇవి నేనేంచేస్తే అవిగూడా అదే చేస్తున్నాయి.

కాబట్టి ఒక చిన్న తమాషా చేస్తాను” అనుకొన్నాడు. వెంటనే “ఛీ! వెధవ కోతుల్లారా! యీ టోపీని కూడా పట్టుకొని పొండి” అని తనటోపీని నేలకేసి కొట్టాడు.

వెంటనే కోతులన్నీ “ఊ!ఊ!ఊ!” అంటూ టోపీలన్నీ నేలమీదికి విసిరేశా ఆ టోపీలను అన్నిటినీ ఏరుకొని మూటగట్టుకొని గబగబా అక్కడినుండి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు ఆ వర్తకుడు.

నీతి :- శక్తికంటే యుక్తే గొప్పది.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment