అమ్మ ఇది ఎం పండు – Telugu Short Moral Story

అమ్మ ఇది ఎం పండు

తెనాలి రామలింగడు రాజమందిరానికి వెళుతుం 7] దగా… మందిరంలోని ఒక వ్యక్తి పెద్ద పళ్లెంలో తియ్యటి | | వాసన వస్తున్న పెద్దపెద్ద మామిడిపండ్లనూ ఒక ఉత్త జ రాన్నీ అందులో ఉంచి తీసుకువెళుతున్నాడు.

ఆ మామిడిపండ్లు చూసేందుకూ చాలా బాగుండటంతో రామలింగడికి వాటిని తినాలనిపించింది. అయినా | తమాయించుకొని రాజమందిరానికి చేరాడు.

అతని వెనకాలే మామిడిపండ్ల పళ్లెంతో లోపలికి వచ్చిన వ్యక్తి…’రాజూ వీటిని మీ కోసం పక్కరాజ్యపు రాజు పంపించారు. ఈ పండ్లు తిన్న వాళ్లకి , ప్రాప్తిస్తుం దని సందేశం’ అన్నాడు.

పండ్లు అక్కడపెట్టి వెళ్లమని చెప్పాడు రాజు ఎదురుగా ఉన్న పండ్లను చూసి రామలింగడికి బాగా నోరూరింది. వెంటనే అందులోని ఒక పండును తీసుకుని కొరికాడు.

ఏమిటీ… మహారాజు కోసం పంపిన పండును నువ్వు తింటావా… అదీ కనీసం నా అనుమతి తీసుకోకుండానే…ఎంత ధైర్యం…నీకు మరణ శిక్ష తప్పదు…’

అంటూ గట్టిగా అరిచిన రాజు భటులను పిలిపించి రామలింగడిని తీసుకుపొమ్మన్నాడు. వాళ్లు రామలింగడిని పట్టుకోగానే… ‘అమ్మో పక్కరాజ్యపు రాజు ఎంత దుర్మార్గుడు.

మంచి పండ్లని చెప్పి, ఎలాంటి మామిదిపంద్లను మనకు పంపాడు. ఈ పండు ముక్కను కొరికినందుకే వెనువెంటనే నాకు చావు మూడింది. అదే పండు మొత్తం తిన్నవాడు పమైపోతాదో…’ అంటూ అరవడం మొదలుపెట్టాడు.

రామలింగడి చమత్కారపు మాటలకు రాజుకు విపరీతంగా నవ్వు వచ్చింది. అతన్ని వదలమని చెప్పడమే కాకుందా కొన్ని పండ్లను కూడా రామలింగడికిచ్చి పంపాడు.

Also read More Stories Neethi Kathalu

Also Read More Akbar & Birbal Stories

Also Read More Podupu Kathalu

Also read More Tenali Ramakrishna Stories

Leave a Comment